టీడీపీకి బలంగా ఉన్న వర్గాలు కొన్ని ఇప్పటికే వైసీపీ వైపు వెళ్లిపోయాయి.ఎన్టీఆర్ కార్డును జగన్ ఎప్పుడో సులువుగానే వాడేశా రు.అదేవిధంగా ఎన్టీఆర్ వినిపించిన ఆత్మగౌరవ నినాదాన్నే జగన్ కూడా వినిపించి సక్సెస్ అయ్యారు.ఆ విధంగా ఆయన నాయకుడిగా ఎంతో పేరు తెచ్చుకునేందుకు ఎన్టీఆర్ ప్రత్యక్షంగానూ,పరోక్షంగానూ ఓ ప్రత్యేక కారణం అయ్యారు.ఇప్పుడు తాజాగా మారుతున్న పరిణామాల నేపథ్యంలో అటు ఎన్టీఆర్ ను ఇటు బాలయ్యను ఏక కాలంలో వాడుకునేందుకు జగన్ స్కెచ్ వేశారా అంటే ఔననే అంటున్నాయి పరిణామాలు.
ముఖ్యంగా ఎన్టీఆర్ పేరును కృష్ణా జిల్లా (విజయవాడ కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లా)కు పెట్టి ఓ విధంగా సక్సెస్ అయ్యారు.కొడాలి నాని,వల్లభనేని వంశీ లాంటి టీడీపీ భక్తులను వైసీపీలో ఉంచుకుని ఇంకో విధంగా జగన్ సక్సెస్ అయ్యారు.మంచో,చెడో ఇప్పటిదా కా వాళ్లు చంద్రబాబును ఇష్టం వచ్చిన విధంగా ఇంకా చెప్పాలంటే జగన్ చెప్పిన దాని కన్నాఎక్కువగానే తిడుతున్నారు అని కమ్మ సామాజికవర్గ నేతలు మండి పడుతున్నారు.కారణాలు ఏవయినా నాని తిట్లు చంద్రబాబుకు మేలు చేశాయా లేదా కీడు చేశాయా అన్నది అటుంచితే ప్రస్తుతం మాత్రం వైసీపీకి బాగానే ఉపయోగపడుతున్నాయి.ఈ క్రమంలో చంద్రబాబు నాయుడ్ని ఎన్ని విధాల దూషించాలో అన్ని విధాల దూషించి పై చేయి సాధించారు నాని.