టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం బిజీబిజీగా గడుపుతోంది. ఓవైపు సిటాడెల్ సిరీస్ షూటింగ్.. మరోవైపు శాకుంతలం సినిమా ప్రమోషన్స్‌తో చాలా బిజీగా ఉంటోంది. అందుకే తరచూ ముంబయి, హైదరాబాద్ మధ్య చక్కర్లు కొడుతోంది.
ఇక ఈ భామ ప్రస్తుతం తన ఫోకస్ అంతా శాకుంతలం సినిమా ప్రమోషన్స్‌పైనే పెట్టింది. తాజాగా ముంబయిలో ఈ సినిమా హిందీ వెర్షన్‌కు ప్రమోషన్స్‌లో పాల్గొంది. ఈ మూవీలో తనకు జంటగా నటించిన దేవ్ మోహన్‌తో కలిసి సమంత ప్రమోషన్స్‌కు హాజరైంది.
అయితే తాజాగా సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు దాచడం అలాగే ఫేక్ గా ఉండడం నచ్చవంటూ పేర్కొంది సమంత. నా జీవితంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. నా లైఫ్ తెరిచిన పుస్తకం.. నా జీవితంలో ఎత్తు పొలాలను పారదర్శకంగా అందరూ చూడవచ్చు అని పేర్కొంది సమంత. జీవితంలో సంతోషంగా ఉండడం అలాగే ప్రేమను పంచడం మాత్రమే తనకు తెలుసు అని వెల్లడించింది.