మన కోరికలు నెరవేరాలని మంచే జరగాలని భగవంతుని ప్రార్థించడానికి ఆలయానికి వెళుతూ ఉంటాం. నిజానికి కాసేపు మనం ఆలయం దగ్గర సమయం గడిపితే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఏదో తెలియని సంతృప్తి మనసులో కలుగుతూ ఉంటుంది. ఆలయానికి వెళ్ళినప్పుడు మనం కొన్ని పద్ధతుల్ని కచ్చితంగా పాటించాలి. దేవాలయానికి వెళ్ళినప్పుడు శుభ్రమైన దుస్తులతో వెళ్లాలి అలానే దేవుడుని దర్శించుకునేటప్పుడు దేవాలయం నుండి వచ్చే వరకు కొన్ని నియమాలు ఉంటాయి. ఎక్కువగా మన పెద్దలు దేవాలయానికి వెళ్లిన తర్వాత కాసేపు కూర్చుని అప్పుడు రమ్మని అంటుంటారు.
ఇది మీరు కూడా పలుమార్లు విని ఉంటారు ఎందుకు అసలు దేవాలయానికి దర్శనం చేసుకున్న తర్వాత కాసేపు కూర్చోవాలి వెంటనే వచ్చేయకూడదు దానికి కారణం ఏంటంటే… గుళ్లో ప్రశాంతత ఉంటుంది దేవుడిని దర్శనం నుంచి చేసుకోగానే మనలో కోపం అహం ఆవేశం స్వార్థం కాసేపు దూరం అవుతాయి. ఒకవేళ వెంటనే మనం బయటకు వెళ్ళిపోతే ఎప్పటిలానే ఉంటాము ఆ ప్రశాంతత ఉండదు అదే కొంచెం సేపు మనం ఆలయంలో కూర్చుంటే ప్రశాంతత కలుగుతుంది.
ప్రశాంతత ప్రభావం మనసు మీద పడుతుంది. అలానే దేవాలయంలో మనం చేసిన పూజలు యాగాల ఫలితం వలన మాలిన్యం కరుగుతుంది. కొద్దిసేపైనా ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన సమయాన్ని గడుపుతాం. పైగా అక్కడ కూర్చోవడం వలన ద్యాస ఇతర విషయాల మీద మళ్లదు కేవలం దేవుడి మీద ఉంటుంది. ఇది ఒక ప్రాణయామంలో పని చేస్తుంది అందుకే కాసేపు దేవాలయంలో కూర్చోవడం మంచిదని అంటారు.