సినిమా ప్రపంచం తో పరిచయం వున్న వారికి సమంత గురించి పరిచయం అక్కరలేదు. అక్కినేని వారి కోడలు అయిన తర్వాత సినిమాలు తగ్గించిన సమంత, నాగ చైతన్య తో విడాకుల తర్వాత మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. విడాకుల తర్వాత వరసగా సినిమాలు ఒప్పుకోవడం చేస్తూ ట్రెండింగ్ వుంటోంది. ఇంకో రెండు సంవత్సారాల వరకు ఆమె డేట్స్ ఖాళీ లేవంటే తన జోరు ఎలా వుందో అర్ధం చేసుకోవచ్చు.
పుష్ప సినిమా లో ప్రత్యేక మైన సాంగ్ లో వూఊ అంటావా మామ ఊహూ అంటావా అంటూ డాన్స్ చేసి కుర్ర కారు గుండెల్లో గుబులు రేపింది. ఈ సాంగ్ తో పాన్ ఇండియా స్థాయిలో వచ్చింది. దీనితో బాలీవుడ్ బడా నిర్మాత లు సమంత డేట్స్ కోసం బారులు తీరారు.దీనితో సమంత భారీ గా రెమ్యునరేషన్ అడుగుతోందట. ప్రస్తుతం సమంత తాను చేయబోయే సినిమాలకు దాదాపు రూ. 3-8కోట్ల వరకు అందుకొంటోందట.
బాలీవుడ్ నిర్మాతలు సమంత అడిగినంత ఇవ్వడానికి రెడీ గా ఉన్నారట.ప్రస్తుతం తాను ముంబైలో రూ. 30కోట్లతో ఓ విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసే ప్రయత్నాలలో వుందట. ఇక్కడ ఇల్లు వుంటే బాలీవుడ్ ను , సౌత్ ను కవర్ చేయొచ్చని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా సమంత టైటిల్ రోల్ లో నటించిన యశోద సినిమా నవంబర్11న విడుదలకు సిద్ధమవుతుంది. మరోవైపు ససమంత హీరో విజయ్ దేవరకొండతో ఖుషీ చిత్రంలో నటిస్తుంది.