Samantha : ఒకేరోజున సమంత, అఖిల్ అక్కినేని చిత్రాల విడుదల..‘ఏజెంట్‌’తో ‘యశోద’కు పోటీ..

-

బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు.. టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్యకు డైవోర్స్ ఇచ్చిన తర్వాత తన ప్రొఫెషనల్ కెరీర్ పైన ఫుల్ ఫోకస్ పెట్టేసింది. ఈ క్రమంలోనే ఆమె పాన్ ఇండియా ఫిల్మ్స్ చేస్తోంది.

ఇంటర్నేషనల్ ఫిల్మ్ కు కూడా సైన్ చేసిన సామ్.. ప్రజెంట్ బాలీవుడ్ పైన కాన్సంట్రేట్ చేసింది. ‘పుష్ప’ చిత్రంలో స్పెషల్ సాంగ్ కూడా చేసిన సామ్..తాను నటిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘యశోద’ షూట్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫిల్మ్ రిలీజ్ డేట్ ను చిత్ర యూనిట్ తాజాగా అనౌన్స్ చేసింది.

హరీశ్ నారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్..వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరి లైన్ తో వచ్చినట్లు సమాచారం. చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇందులో వెర్సటైల్ యాక్ట్రెస్ వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేశ్ , మురళీ శర్మలు కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఇందులో యాక్షన్ సీక్వెన్సెస్ కోసం హాలీవుడ్ డైరెక్టర్ యానిక్ బెన్ ను రంగంలోకి దించారు. ఆయన డైరెక్షన్ లో యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్స్ ట్రార్డినరీగా వచ్చాయని తెలుస్తోంది.

తాజాగా ‘యశోద’ మూవీ మేకర్స్ అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్, అఖిల్ అక్కినేని ఫిల్మ్ ‘ఏజెంట్’ రిలీజ్ డేట్ ఒకే రోజు కావడం గమనార్హం. ఈ ఏడాది ఆగస్టు 12న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ‘ఏజెంట్’ మూవీ యూనిట్ సభ్యులు తెలిపారు.

ఈ పిక్చర్ లో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీ రోల్ ప్లే చేశారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపైన భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. చూడాలి మరి.. ‘ఏజెంట్’ చిత్రంతో పోటీ పడి ‘యశోద’ ఫిల్మ్ ఏ మేరకు సక్సెస్ అవుతుందో.. రెండు చిత్రాలు విజయం సాధించాలని సినీ అభిమానులు అయితే కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news