శాంసంగ్ కంపెనీ గెలాక్సీ ఎ31 పేరిట ఓ నూతన మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఇందులో 6.4 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఇన్ఫినిటీ-యు సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఇందులో ఆక్టాకోర్ ప్రాసెసర్, 6జీబీ పవర్‌ఫుల్ ర్యామ్‌లను అమర్చారు. వెనుక భాగంలో 48 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాతోపాటు 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 5 మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్, 5 మెగాపిక్సల్ మాక్రో కెమెరాలను ఏర్పాటు చేశారు. ముందు భాగంలో 20 మెగాపిక్సల్ కెమెరాను అమర్చారు. ఈ ఫోన్‌లో ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందిస్తున్నారు. డెడికేటెడ్ డ్యుయల్ సిమ్, మైక్రోఎస్‌డీ కార్డు స్లాట్లను ఏర్పాటు చేశారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. దీనికి ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్‌ను అందిస్తున్నారు.
శాంసంగ్ గెలాక్సీ ఎ31 స్పెసిఫికేషన్లు…
* 6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఇన్ఫినిటీ-యు సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే
* 2400 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి65 ప్రాసెసర్, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్
* 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 10, డ్యుయల్ సిమ్
* 48, 8, 5, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
* ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, శాంసంగ్ పే
* డాల్బీ అట్మోస్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ
* బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్
శాంసంగ్ గెలాక్సీ ఎ31 స్మార్ట్‌ఫోన్ ప్రిజం క్రష్ బ్లాక్, ప్రిజం క్రష్ బ్లూ, ప్రిజం క్రష్ వైట్ కలర్ ఆప్షన్లలో విడుదలైంది. రూ.21,999 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్, శాంసంగ్ ఓపెన్ హౌస్, రిటెయిల్ స్టోర్‌లలో లభిస్తోంది.