శాంసంగ్ ఎలాక్సీ M01 స్మార్ట్ ఫోన్ ధ‌ర త‌గ్గింది.. కొత్త ధ‌ర ఎంతంటే..?

-

శాంసంగ్ కంపెనీ గ‌త నెల రోజుల కింద‌ట గెలాక్సీ M01 స్మార్ట్‌ఫోన్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసిన విష‌యం విదిత‌మే. కాగా ఈ ఫోన్ ధ‌ర‌ను రూ.600 త‌గ్గించారు. దీంతో ప్ర‌స్తుతం ఈ ఫోన్‌ను వినియోగ‌దారులు త‌గ్గించిన ధ‌ర‌కే కొనుగోలు చేయ‌వ‌చ్చు.

Samsung Galaxy M01 price slashed in India

గెలాక్సీ M01 స్మార్ట్ ఫోన్‌కు చెందిన 3జీబీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.8,999గా ఉండేది. రూ.600 త‌గ్గించడంతో ఇప్పుడు రూ.8,399 ధ‌ర‌కే ల‌భిస్తోంది. అమెజాన్ సైట్‌లో త‌గ్గిన ధ‌ర‌కు ఈ ఫోన్‌ను విక్ర‌యిస్తున్నారు. అయితే ఈ ఫోన్ ధ‌ర‌ను ప‌ర్మినెంట్‌గా త‌గ్గించారా, లేక ఈ ఆఫ‌ర్ కొన్ని రోజుల వ‌ర‌కేనా అన్న వివ‌రాల‌ను శాంసంగ్ తెలియ‌జేయ‌లేదు.

గెలాక్సీ M01 స్మార్ట్ ఫోన్‌లో.. 5.7 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ రిజల్యూష‌న్ క‌లిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. స్నాప్‌డ్రాగ‌న్ 439 ప్రాసెస‌ర్‌, 3జీబీ ర్యామ్‌, 13, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఇందులో 4000 ఎంఏహెచ్ కెపాసిటీ క‌లిగిన బ్యాట‌రీ కూడా ఉంది. ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌ను అందిస్తున్నారు. ఫేస్ అన్‌లాక్ స‌దుపాయం ఉంది. డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 ఫీచ‌ర్లు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news