పెను ప్రమాదం నుంచి బయటపడిన ట్రంప్.. కొంచముంటేనా..!

-

అగ్రరాజ్యమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి కొంచంలో పెద్ద ప్రమాదం తప్పింది. ట్రంప్ ప్రయాణిస్తున్న ఎయిర్‌ఫోర్స్-1 విమానం రాజధాని వాషింగ్టన్ సమీపంలోని విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో అకస్మాత్తుగా ఓ డ్రోన్ ఢీకొట్టినంత పని చేసింది. ఎయిర్‌ఫోర్స్-1 కుడివైపున అత్యంత సమీపానికి డ్రోన్ రావడాన్ని విమానంలో ప్రయాణించినవారు గమనించారు. అయితే, ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

కాగా, ట్రంప్ వెంట విమానంలో ప్రయాణించిన వారు ఈ విషయాన్ని వెల్లడించారు. పసుపు, నలుపు రంగులో ఉన్న ఆ డ్రోన్ దాదాపు విమానాన్ని ఢీకొట్టినంత పనిచేసిందన్నారు. ఈ ఘటనపై అమెరికా సీక్రెట్ సర్వీస్ దర్యాప్తు చేస్తోంది. ఇకపోతే ఇటీవలే డొనాల్డ్ ట్రంప్ సోదరుడు రాబర్ట్ ట్రంప్(71) తీవ్ర అనారోగ్యం కారణంగా మరణించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news