ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్.. గెలాక్సీ ఎం01ఎస్ పేరిట ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఇందులో 6.2 ఇంచుల హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ ఉన్న ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి22 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్‌లను అందిస్తున్నారు. వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఆండ్రాయిడ్ 9.0 ఓఎస్‌ను ఇందులో అందిస్తున్నారు. వెనుక భాగంలో 13 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాతోపాటు 2 మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. ముందు భాగంలో 8 మెగాపిక్సల్ కెమెరా ఉంది. 4000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఈ ఫోన్‌లో ఏర్పాటు చేశారు.
శాంసంగ్ గెలాక్సీ ఎం01ఎస్ స్పెసిఫికేషన్లు…
* 6.2 ఇంచుల హెచ్‌డీ ప్లస్ పీఎల్ఎస్ టీఎఫ్‌టీ ఎల్‌సీడీ ఇన్ఫినిటీ-వి డిస్‌ప్లే
* 1520 × 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి22 ప్రాసెసర్
* 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0
* డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
* ఫింగర్ ప్రింట్ సెన్సార్, డాల్బీ అట్మోస్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2
* 4000 ఎంఏహెచ్ బ్యాటరీ
శాంసంగ్ గెలాక్సీ ఎం01ఎస్ స్మార్ట్‌ఫోన్ రూ.9,999 ధరకు వినియోగదారులకు లభిస్తోంది.