Samsung Galaxy S24: వైఫై 7 కనెక్టివిటీ ఫీచర్‌తో లాంచ్ కానున్న మొదటి స్మార్ట్ ఫోన్

-

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ త్వరలో ఒక కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేయనుంది. అదే గెలాక్సీ ఎస్24 స్మార్ట్ ఫోన్.. ఇందులో ఓ స్పెషల్ ఫీచర్‌ ఉంది. అదేంటంటే.. వైఫై 7 కనెక్టివిటీ ఫీచర్‌తో లాంచ్ కానున్న మొదటి స్మార్ట్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎస్24.

వైఫై 7 వెర్షన్‌తో వచ్చే స్మార్ట్ ఫోన్లు 2024 సెప్టెంబర్‌లో లాంచ్ అవుతాయని గతంలో వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లు వైఫై 6, వైఫై 6ఈ వెర్షన్లతో వస్తున్నాయి. వైఫై 7 నెట్‌వర్కింగ్ ప్రో సిరీస్‌ను క్వాల్‌కాం ఈ సంవత్సరం మేలో లాంచ్ చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైఫై 6 స్టాండర్డ్ కంటే 2.4 రెట్లు వేగంగా వైఫై 7 పని చేయనుంది.

వైఫై 7 ద్వారా సెకనుకు 30 జీబీ ఇంటర్నెట్ లభించనుంది. వైఫై ఇన్నొవేషన్లకు దారి చూపడం, వినియోగ మార్గాలను పెంచడం వంటివి దీని ద్వారా సాధ్యం అవుతాయి. ఏఆర్/వీఆర్, 4కే, 8కే స్ట్రీమింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి లో లేటెన్సీ అవసరమైన పనులను సులభంగా చేసుకోవచ్చు. ఫిజికల్, మీడియం యాక్సెస్ కంట్రోల్స్‌ను మెరుగుపరచడంపై వైఫై 7 ఫోకస్ పెట్టనున్నట్లు సమాచారం… 2.4 గిగాహెర్ట్జ్, 5 గిగాహెర్ట్జ్, 6 గిగాహెర్ట్జ్ స్పెక్ట్రం బ్యాండ్లను వైఫై 7 సపోర్ట్ చేయనుంది. 6 నుంచి 16 స్ట్రీమ్‌ల రేంజ్‌ను ఇది ఆఫర్ చేయనుంది.

క్వాల్‌కాం తెలుపుతున్న దాని ప్రకారం ప్రపంచంలోనే అత్యంత స్కేలబుల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫాం పోర్ట్‌ఫోలియో వైఫై 7 కానుంది.

ఈరోజుల్లో వర్క్‌ఫ్రమ్‌ కారణంగా.. అందరూ వైఫ్‌ పెట్టించుకున్నారు.. అయితే అంత డబ్బు పెట్టి వైఫై ఏర్పాటు చేసుకున్నాకొన్నిసార్లు స్లోగా వస్తుంది.. కారణం ఏంటో తెలియక మనం నెట్‌వర్క్‌ వాళ్లకు ఫోన్‌ చేసి విసిగిస్తాం.. ఇలాంటి కొన్ని టిప్స్‌ వల్ల ఈ సమస్య నుంచి బయటపడొచ్చు..

కొన్నిసార్లు మనకి అవసరం లేని డివైస్‌లు కూడా వైఫైకి కనెక్ట్ అయి ఉంటాయి. వాటిని ముందు డిస్ కనెక్ట్ చేయాలి.
ఇంట్లో రూటర్‌ను ఎక్కడ పెట్టారో కూడా చూసుకోవాలి. గోడలు, ఎలక్ట్రానిక్ వస్తువులకు రూటర్‌ను దూరంగా ఉండాలి.
మీరు డ్యూయల్ బ్యాండ్ రూటర్‌ను ఉపయోగిస్తున్నట్లయితే, రూటర్‌కు, మీకు మధ్య ఉన్న దూరాన్ని బట్టి ఫ్రీక్వెన్సీ మార్చుకోవాల్సి ఉంటుంది.
మీరు రూటర్‌కు దూరంగా ఉంటే 2.4 గిగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీని, దగ్గరగా ఉంటే 5 గిగా హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీని ఎంచుకుంటే వైఫై స్పీడ్‌గా వస్తుంది.
రూటర్ యాంటెన్నాలను ఎప్పటికప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి.
రూటర్‌ను ఆఫ్ చేసి మళ్లీ ఆన్ చేయాలి. అప్పటికీ స్పీడ్ రాకపోతే ఎఫ్‌యూపీ చెక్ చేసుకోండి..
ఇన్ని చేసినా స్పీడ్‌ పెరగలేదంటే.. సర్వీస్‌ ప్రొవైడర్‌ను సంప్రదించాల్సిందే..
Attachments area

Read more RELATED
Recommended to you

Latest news