శాంసంగ్ కంపెనీ శాన్ఫ్రాన్సిస్కోలో నిర్వహించిన తన గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్లో మరో నూతన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను గెలాక్సీ జడ్ ఫ్లిప్ పేరిట విడుదల చేసింది. గతంలో వచ్చిన గెలాక్సీ ఫోల్డ్ మడతబెట్టే స్మార్ట్‌ఫోన్‌లో మొదట్లో పలు సమస్యలు రాగా శాంసంగ్ వాటిని సరిదిద్ది ఆ ఫోన్‌ను మళ్లీ మార్కెట్లోకి రీలాంచ్ చేసింది. అయితే ఆ ఫోన్ అంత పెద్దగా సక్సెస్ కాలేదు. ఈ క్రమంలో గెలాక్సీ జడ్ ఫ్లిప్ పేరిట శాంసంగ్ మరో నూతన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను తాజాగా విడుదల చేసింది. మరి ఈ ఫోన్లో అందిస్తున్న ఫీచర్ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందామా..!
గెలాక్సీ జడ్ ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్‌లో 6.7 ఇంచుల ఫుల్ హెచ్డీ ప్లస్ డైనమిక్ అమోలెడ్ మెయిన్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. ఈ డిస్ప్లే 2636 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. దీన్ని శాంసంగ్ ఇన్ఫినిటీ ఫ్లెక్స్ డిస్ప్లేగా వ్యవహరిస్తోంది. 2 లక్షల సార్లు మడతబెట్టినా చెక్కు చెదరని విధంగా ఈ డిస్ప్లేను తయారు చేశామని శాంసంగ్ తెలిపింది. ఇక ఈ ఫోన్లో 1.1 ఇంచుల సైజ్ ఉన్న మరో ఎక్స్టర్నల్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. ఇది కూడా సూపర్ అమోలెడ్ డిస్ప్లే కావడం విశేషం. ఈ డిస్ప్లే 300 x 112 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. ఈ డిస్ప్లేపై యూజర్లు నోటిఫికేషన్లు చూసుకోవచ్చు.
గెలాక్సీ జడ్ ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌లను అందిస్తున్నారు. వెనుక భాగంలో 12 మెగాపిక్సల్ వైడ్ యాంగిల్ కెమెరాతోపాటు 12 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాను ఏర్పాటు చేశారు. అలాగే ముందు భాగంలో 10 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్లో ఆండ్రాయిడ్ 10 ఓఎస్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ తదితర ఇతర ఫీచర్లను అందిస్తున్నారు.
శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫ్లిప్ ఫీచర్లు…
* 6.7 ఇంచుల ఫుల్ హెచ్డీ ప్లస్ డైనమిక్ అమోలెడ్ ఇన్ఫినిటీ ఫ్లెక్స్ డిస్ప్లే, 2636 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* 1.1 ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 300 x 112 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్
* ఇ-సిమ్ + నానో సిమ్, 12, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 10 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
* బ్లూటూత్ 5.0, యూఎస్బీ టైప్ సి, ఎన్ఎఫ్సీ, శాంసంగ్ నాక్స్ సెక్యూరిటీ, ఫేషియల్ రికగ్నిషన్
* 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, 15 వాట్ల ఫాస్ట్ చార్జింగ్, వైర్లెస్ చార్జింగ్
శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్ ధర 1380 డాలర్లు (దాదాపుగా రూ.98,400)గా ఉంది. అమెరికా, కొరియా మార్కెట్లలో ఫిబ్రవరి 14వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను విక్రయించనున్నారు. ఆ తరువాత భారత్ సహా పలు ఇతర దేశాల్లోనూ ఈ ఫోన్‌ను విక్రయించనున్నారు.