ఒక ఫోన్ల తయారీకి చెందిన కంపెనీలో ఆ కంపెనీకి చెందిన ఫోన్లను కాకుండా ఉద్యోగులు వేరే కంపెనీకి చెందిన ఫోన్లను వాడితే ఎలా ఉంటుంది ? కంపెనీకే కాదు, అటు ఆ ఫోన్లకు కూడా వినియోగదారుల్లో చెడ్డ పేరును తీసుకువస్తుంది. అయితే ఈ విషయాన్ని శాంసంగ్ కంపెనీ గమనించనట్లుంది. అందుకనే తప్పులో కాలేసింది. ఇంతక అసలు ఏం జరిగిందంటే ?
శాంసంగ్ కంపెనీ తాజాగా గెలాక్సీ ఎస్ 21 సిరీస్ ఫోన్లను విడుదల చేసింది తెలుసు కదా. వాటికి గాను ట్విట్టర్‌లో ప్రమోషన్ పెట్టింది. ఒక పోల్‌ను శాంసంగ్ నిర్వహించింది. అయితే ఆ పోల్ పెట్టేందుకు శాంసంగ్ ఐఫోన్ లో ట్విట్టర్ ఖాతాను ఉపయోగించింది. ఆ విషయాన్ని ట్వీట్ కింది భాగంలో గమనించవచ్చు. ట్విట్టర్ ఫర్ ఐఫోన్ అని ఐఫోన్‌లో ట్విట్టర్ యాప్ ఉపయోగించి ఆ పోల్ పెట్టినట్లు తెలుస్తుంది. అయితే దీనిపై నెటిజన్లు స్పందించారు.
Oops! Samsung just used an iPhone to promote tomorrow's Unpacked event for the upcoming Galaxy S21. pic.twitter.com/rvpGKhUjfu
— MacRumors.com (@MacRumors) January 13, 2021
శాంసంగ్ కంపెనీ తన కొత్త ఫోన్లను ప్రమోట్ చేసుకోవడం ఓకే. కానీ తన ఫోన్లతో కాకుండా ఐఫోన్‌తో ట్వీట్ చేయడం ఏమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. శాంసంగ్ తప్పు చేసి దొరికిపోయింది కనుక ఆ కంపెనీని వారు ఆడుకుంటున్నారు. ఆ కంపెనీని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. అంటే శాంసంగ్ కంపెనీలో ఉద్యోగులే ఆ కంపెనీకి చెందిన ఫోన్లను వాడకపోతే ఇక ప్రజలు ఎలా వాడుతారు ? కదా.. అందుకనే నెటిజన్లు శాంసంగ్‌ను విమర్శిస్తున్నారు. ఇక తప్పు తెలుసుకున్న శాంసంగ్ వెంటనే పోల్‌ను సరి చేసింది.