పాకిస్తాన్ లో పిఏఎస్ గా హిందు మహిళ… మన దగ్గర ఐఏఎస్ అన్నట్టు…!

-

మొదటి సారి పాకిస్తాన్ లో ఒక హిందు మహిళ ఆ దేశ ప్రతిష్టాత్మక సెంట్రల్ సుపీరియర్ సర్వీసెస్ (సిఎస్ఎస్) పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, పాకిస్తాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ (పిఎఎస్) కు ఎంపికైంది. పాకిస్తాన్‌లో అత్యధిక హిందూ జనాభా ఉన్న సింధ్ ప్రావిన్స్‌లోని షికార్‌పూర్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతానికి చెందిన సనా రామచంద్ ఎంబిబిఎస్ చదివారు. రాత పరీక్షల్లో హాజరైన 18,553 మందిలో సిఎస్‌ఎస్ పరీక్షలో విజయం సాధించిన 221 మంది అభ్యర్థులలో ఆమె ఒకరు.

వైద్య, మానసిక మరియు వివిధ రకాల పరిక్షల తర్వాత ఆమె ఉత్తీర్ణత సాధించారు. తాను సాధించిన ఈ విజయం తన తల్లి తండ్రులకు అంకితం ఇస్తున్నా అని చెప్పారు. కఠినంఆ ఉన్నా సరే కష్టపడి చదివా అని చెప్పారు. మన ఇండియాలో ఐఏఎస్ ఏ విధంగా అక్కడ పిఏఎస్ ఆ విధమైన ఉద్యోగం అన్నమాట. మొత్తం 79 మంది మహిళలు తుది జాబితాలో చోటు దక్కించుకున్నప్పటికీ పోటీలో సనా నిలబడింది.

Read more RELATED
Recommended to you

Latest news