కరోనాకు కొత్త మందు… ఆక్సీజన్ వరకు వెళ్ళకుండా…!

-

డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. డియోక్సీ-డి-గ్లూకోజ్ (2-డిజి) ను కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రోగులకు మితంగా ఉపయోగించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ ప్రయోగశాలగా ఉన్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్, హైదరాబాద్‌లోని డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్‌తో కలిసి ఈ మందుని అభివృద్ధి చేసింది.

మూడు దశల పరిక్షల అనంతరం ఈ మందుని ఉపయోగించడానికి అనుమతి ఇచ్చారు. ఆక్సీజన్ వరకు కరోనా రోగులు వెళ్ళకుండా ఈ మందు వాడితే కాస్త ప్రయోజనం ఉండవచ్చు అని వెల్లడించారు. వైరస్-సోకిన కణాలను కట్టడి చేయడం ద్వారా వైరస్ తీవ్రతను కాస్త అదుపు చేస్తుంది అని నిపుణులు తెలిపారు. 220 మంది రోగులపై దీని పరిక్షలు నిర్వహించారు.

Read more RELATED
Recommended to you

Latest news