బాలీవుడ్ లో సందీప్ రెడ్డి వంగా సూపర్ క్రేజ్..!!

-

సందీప్ రెడ్డి వంగా ఒక సంచలన దర్శకుడు. అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ ను స్టార్ చేయడం తో పాటు, తాను కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. మళ్లీ అదే సినిమాకు కబీర్ సింగ్ గా తీసి సూపర్ హిట్ కొట్టాడు. ఇక ఈ సినిమా తో బాలీవుడ్ లో హీరోలు, నిర్మాతలు అందరూ వరస కట్టారు. కాని మనోడు ఎక్కడా తగ్గకుండా, వచ్చింది అవకాశం అని అన్ని ఒప్పుకోకుండా సెలెక్టివ్ గా సినిమాలు తీస్తున్నాడు.

- Advertisement -

సందీప్ ప్రస్తుతం రణ్ బీర్ కపూర్ తో “యానిమల్” సినిమాను చేస్తున్నారు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది. గతకొన్ని రోజుల నుండి ఈ సినిమా షూటింగ్  జరుగుతుంది. ఈ సినిమాకు కూడా సందీప్ చాలా ఇంటెన్స్ గా పనిచేస్తున్నాడు అని తెలుస్తోంది. అలాగే లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న రణ్ బీర్ కపూర్ ను ఫుల్ మాస్ లుక్ లో మార్చి వేసాడట.

ఈ సినిమా కోసం రణ్ బీర్ కపూర్ అభిమానుల ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత సందీప్ ప్రభాస్ తో సినిమా చేయడానికి ప్లాన్ చేసుకున్నాడు. ఈ సినిమాకు స్పిరిట్ అనే పేరు ప్రచారం లో ఉంది. ఇది కూడా ఫుల్ యాక్షన్ మోడ్ లో ఉండే సినిమా అని అంటున్నారు. దీని తర్వాత కూడా చాలా మంది పెద్ద హీరోలు సినిమా చేయమని అడుగుతున్నారని తెలుస్తోంది. కాని ముందు ఇవి పూర్తి అయిన తర్వాత మిగిలినవన్నీ అని చెప్పేశాడట. ఒక తెలుగు దర్శకుడికి బాలీవుడ్ లో ఇంత క్రేజ్ ఉండడం అభినందనీయం.

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...