“అర్జున్ రెడ్డి’ తర్వాత విజయ్ దేవరకొండ చాలా బిజీ అయ్యాడు. రౌడీ స్టార్‌గా ఫుల్ పాపులారిటీ, వరుస సినిమాలు, క్రేజీ రెమ్యూనరేషన్ టోటల్‌గా విజయ్ లైఫే మారిపోయింది. అయితే ఈ హిట్‌ని డైరెక్ట్ చేసిన సందీప్ వంగా మాత్రం విజయ్ రేంజ్‌లో బిజీ కాలేకపోతున్నాడు. అంటే ఈ దర్శకుడు ‘అర్జున్‌రెడ్డి’ సక్సెస్‌ని సరిగా క్యాష్ చేసుకోట్లేదా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది..
“అర్జున్ రెడ్డి’ మూవీ డైరక్టర్ సందీప్ కంటే విజయ్‌కే ఎక్కువ మైలేజ్ తీసుకొచ్చింది.ఆ సక్సెస్ “అర్జున్ రెడ్డి’ ఫాలోయింగ్‌తో విజయ్‌కి భారీ సినిమాలు క్యూ కట్టాయి.స్టార్ బ్యానర్స్‌లో విజయ్ దేవరకొండ సినిమాలు చేశాడు, తాజాగా స్టార్ డైరక్టర్స్ సుకుమార్,పూరీ జగన్నాథ్ డైరక్షన్ లోనూ నటించబోతున్నాడు. కానీ డైరక్టర్ సందీప్ వంగాకి మత్రం ఏ స్టార్ హీరోల కాల్షీట్స్ దక్కట్లేదు. అయితే విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండతో సందీప్ వంగా వెబ్ సీరీస్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. తన తదుపరి చిత్రం ఒక క్రైమ్ స్టోరీ నేపథ్యంలో ఉంటుందని హింట్ ఇచ్చాడు సందీప్. ఈ ప్రాజెక్ట్ కోసం గతంలో టాలీవుడ్‌లో మహేష్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్‌లను అలాగే బాలీవుడ్‌లో రణబీర్ కపూర్, రణవీర్ సింగ్ వంటి స్టార్ హీరోలను కలిసినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ వాళ్లెవరు కూడా ఈ ప్రాజెక్ట్‌ని ఓకే చేయలేదనే టాక్ కూడా వినిపించింది.