శానిటైజేషన్‌ వర్కర్లపై పూలవర్షం, మెడలో కరెన్సీ నోట్ల దండ..

-

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఇప్పుడు పోలీసులు, మున్సిపల్ సిబ్బంది, శానిటైజర్ వర్కర్లు చేస్తున్న కృషి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కరోనా ఎక్కడ ప్రజలకు వ్యాపిస్తుందో అని వాళ్ళు బ్లీచింగ్ చల్లడం స్ప్రే చేయడం వంటివి చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వాళ్ళు ఇప్పుడు కరోనా మీద కనపడని పోరాటం చేస్తున్నారు. కొంత మంది వాళ్ళను అవమానిస్తున్నారు కూడా. బ్లీచింగ్ చల్లలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అంటూ…

అయితే పంజాబ్ ప్రజలు మాత్రం వారి విషయంలో తమ అభిమానం చాటుకున్నారు. తమ ప్రాణాలు కాపాడుతున్న వర్కర్లపై పూల వర్షం కురిపించారు. పంజాబ్‌ పటియాలాలోని నభా వీధిలో నివాసముంటున్న ప్రజలు అందరూ కూడా తమ ఇళ్ళ అంతస్తుల నుంచి పూల వర్ష౦ కురిపించారు. ఒక ముగ్గురు వ్యక్తులు అయితే ఏకంగా పారిశుద్ధ్య కార్మికుడి మెడలో కరెన్సీ నోట్ల దండలు వేసి తమ అభిమానం చాటుకున్నారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయింది. పంజాబ్‌ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసి… పారిశుద్ధ్య కార్మికుడిపై నభా ప్రజలు చూపించిన ఆప్యాయత సంతోషాన్ని ఇచ్చిందన్న ఆయన… కరోనా వైరస్‌పై యుద్ధం చేస్తున్న వారిలో ముందున్న పారిశుద్ధ్య కార్మికులను ఉత్సాహపరుద్దామని ప్రజలకు సూచించారు. శానిటైజేషన్‌ వర్కర్ల కృషి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని అక్కడి స్థానికులు వ్యాఖ్యానించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news