కరీంనగర్ నుంచి సప్తగిరి టూర్.. ఈ ప్రదేశాలన్నీ చూసి రావచ్చు..!

-

ఈ మధ్య ఎన్నో టూర్ ప్యాకేజీలని ఐఆర్సీటీసీ తీసుకు వస్తోంది. అలానే తెలంగాణ సర్కార్ కూడా పలు టూర్ ప్యాకేజీలని తీసుకు వస్తోంది. వీటి ద్వారా మనం మనకి నచ్చిన చోటు కి వెళ్లి రావచ్చు. కరీంనగర్ నుంచి సప్తగిరి పేరు తో టూర్ ప్యాకేజీ ని ఒకటి ఐఆర్‌సీటీసీ టూరిజం ప్రకటించింది. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. ఈ టూర్ లో భాగంగా తిరుమల, కాణిపాకం తో పాటుగా తిరుచానూరు ఆలయాలను కూడా చూసి రావచ్చు.

ఈ టూర్ ప్యాకేజీ సెప్టెంబర్ 7వ తేదీన అందుబాటులో ఉంది. తాజాగా కరీంనగర్ నుంచి ఏపీలోని పలు ప్రాంతాలను చూసేందుకు ప్యాకేజీ ని తీసుకు రావడం జరిగింది. కాణిపాకం, తిరుచానూరు, తిరుమల, తిరుపతి కూడా వెళ్లి రావచ్చు. ఇది మొత్తం 3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీ. మొదటి రోజు కరీంనగర్ నుంచి రైలు స్టార్ట్ అవుతుంది.

రాత్రి మొత్తం జర్నీ ఉంటుంది. 2వ రోజు తిరుపతి రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. హోటల్ లోకి చెకిన్ అయ్యాక శ్రీనివాస మంగాపురం, కాణిపాకం చూడవచ్చు. ఆ తరవాత శ్రీకాళహస్తీ, తిరుచానూరు ఆలయాలకు వెళ్లి రావచ్చు. రాత్రి తిరుపతిలోనే స్తే చేయాలి. మూడవ రోజు ప్రత్యేక దర్శనం ద్వారా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. తరవాత తిరుపతి రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. రాత్రి 08.15 గంటలకు జర్నీ మొదలు అవుతుంది. నాల్గవ రోజు ఎవరి స్టేషన్స్ కి వాళ్ళు చేరుకుంటారు. సింగిల్ షేరింగ్ ధర రూ. 9010 గా వుంది. పూర్తి వివరాలని అధికారిక వెబ్ సైట్ లో చూడవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news