సంక్రాంతికి కర్చీఫ్ వేసిన సర్కారు వారి పాట

-

మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా మూవీ సర్కారు వారి పాట. పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్పటికే మొదలైంది. మహేష్ బాబు దుబాయ్ వెళ్లడంతో షూటింగ్ దుబాయ్ లోనే జరుగుతుందని అందరూ భావిస్తున్నారు. అయితే గత రెండు మూడు రోజుల నుంచి టాలీవుడ్ లో ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న అన్ని సినిమాలు రిలీజ్ డేట్ లు ప్రకటించాయి.

వారందరితో పాటు మహేష్ బాబు సినిమా యూనిట్ కూడా ఈరోజు రిలీజ్ డేట్ ప్రకటించింది.. ఇది ఒక రకంగా రిలీజ్ డేట్ అనే కంటే సంక్రాంతి సీజన్ మీద కర్చీఫ్ వేయడం అని చెప్పచ్చు. అంటే ముందు కానే సంక్రాంతికి వస్తున్నామంటూ ప్రకటించింది. నిజానికి చాలా సినిమాలు షూటింగ్ దశలో ఉండటంతో ఎవరు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని టెన్షన్ నెలకొంది. ఈ క్రమంలోనే ఎలాంటి రిలీజ్ డేట్ క్లాష్ లు రాకుండా ముందుగానే అందరూ రిలీజ్ డేట్స్ ప్రకటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news