కేసీఆర్ ది పాల‌భిషేకాల తాపత్ర‌య‌మే !

-

  • ప్ర‌భుత్వ తీరుపై గొంతెత్తితే కేసులా?
  • ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌ను క‌ప్పిపుచ్చ‌డానికే తెర‌పైకి ఫిట్‌మెట్ కుట్ర‌
  • ప్ర‌భుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ఫైర్

హైద‌రాబాద్: పాలాభిషేకాల కోసం తాపత్ర‌య‌ప‌డే తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్.. రాష్ట్రంలో మ‌ళ్లీ కొత్త డ్రామాకు తెర‌లెపారంటూ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజయ్ మ‌రోసారి ఫైర్ అయ్యారు. కేవ‌లం త‌న‌కు అనుకూలంగా ఉండే ఉద్యోగ సంఘాల‌నే సీఎస్ నేతృత్వంలోని త్రిస‌భ్య క‌మిటీ బిస్వాల్ రిపోర్టుపై అభిప్రాయ సేక‌ర‌ణ‌కు పిలుస్తున్నార‌ని ఆరోపించారు. దీనిలో భాగంగానే త‌న అనుకూల సంఘాల‌తో చ‌ర్చించి, వాళ్ల‌తో పాలాభిషేకాలు చేయించుకోవాల‌నుకుంటున్నార‌ని అన్నారు.

బండి సంజ‌య్ తాజాగా సోష‌ల్ మీడియా వేదికగా రాష్ట్ర ప్ర‌భుత్వం తీవ్ర ఆరోప‌ణలు చేశారు. “తన అనుకూల సంఘాలతో చర్చించి, వాళ్లతో పాలాభిషేకం చేయించుకోవాలని అనుకుంటున్నాడు సీఎం కేసీఆర్. ఇప్పటికే దుబ్బాకలో, గ్రేటర్ హైదరాబాద్ లో ఓటర్లు చేసిన అభిషేకం సరిపోయినట్లు లేదు. అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షన్ దారుల సంఘాలను చర్చకు పిలవాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది” అని పేర్కొన్నారు. అలాగే, రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షన్ దారులను నట్టేట ముంచినట్టు బిస్వాల్ కమిటీ రిపోర్ట్ ఉందని లక్షలాది మంది కడుపు మంటతో రగిలి పోతుంటే, సీఎం ఎక్కడ పడుకున్నాడు. ఇప్పటిదాకా ఎందుకు స్పందించడం లేదంటూ విమర్శించారు.

ప్ర‌స్తుతం 7.5% ఫిట్ మెంట్ ను ముందు పెట్టి పెండింగ్ లో ఉన్న ఎన్నో ఉద్యోగ సమస్యలు తెర పైకి రాకుండా కేసీఆర్ కుట్ర చేస్తున్నార‌ని ఆరోపించారు. ఆయన ప్లాన్ ప్రకారమే ఇప్పుడు త్రిసభ్య కమిటీ చర్చ అంతా ఫిట్ వైపు డైవర్ట్ అయింద‌నీ, 2014లో ఉద్యోగులకు కేసీఆర్ ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేరలేదంటూ విమ‌ర్శించారు.

ఉద్యోగుల‌కు క‌ల్పించాల్సిన ఈహెచ్ెస్ అమ‌లు కావ‌డం లేద‌నీ, ఎక్క‌డా క్యాష్ లేస్ ట్రీట్ మెంట్ లేద‌ని తెలిపారు. అలాగే, క‌రోనా బారిప‌డిన బాధిత ఉద్యోగుల‌కు ల‌క్ష రూపాయాలు అందిస్తాన‌ని నేడు చేతులు దులుపుకున్నార‌ని బండి సంజ‌య్ ఆరోపించారు. ప్ర‌భుత్వ తీరుపై గొంతెత్తే వారిని కేసుల‌తో బెదిరిస్తున్నార‌న్నారు. ఉద్యోగుల‌కు బీజేపీ అండగా ఉంద‌నీ, వాళ్ల‌ను వేధిస్తే ఊరుకునేది లేద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు.

Read more RELATED
Recommended to you

Latest news