బీహార్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. అధికార, అంగ బలంతో.. ఓ సర్పంచ్ నీచానికి దిగజారాడు. గ్రామానికి చెందిన ముగ్గురు అక్కా చెల్లెళ్ల పై రాక్షకంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాదు.. దీన్ని వ్యతిరేకించిందని.. ఆ ముగ్గురిలో ఓ అమ్మాయి ముక్కును పదునైన ఆయుధంతో కోసేశాడు. ఈ సంఘటన బీహార్ లోని సుపాల్ జిల్లాలోని సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లోధ్ గ్రామంలో చోటు చేసుకుంది.
ఆ గ్రామసర్పంచ్ ముస్తాకిన్ తన సొంత గ్రామానికి చెందిన ముగ్గురు బాలికలన లైంగికంగా వేధించాడని ఆరోపణలు వచ్చాయి. ఈ వేధింపులకు వ్యతిరేకంగా ముగ్గురిలోని ఓ బాలిక నిరసన వ్యక్తం చేయడంతో.. కోపంతో రగిలి పోయిన సర్పంచ్ పదునైన ఆయుధంతో ఆమె ముక్కును కోసాడు. తీవ్ర రక్త స్రావం జరుగుతుండటంతో గాయపడిన బాలికను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రి కి తరలించారు. ఇక సంఘటన తెలిసిన కుటుంబ సభ్యులు సర్పంచ్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.