మహారాష్ట్రలోని ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న విషయం తెలిసిందే. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా మార్చి 31 నుంచి కరోనా నిబంధనలను పూర్తిగా ఎత్తివేస్తు నిర్ణయం తీసుకుంది. అయితే కేంద్ర ప్రభుత్వం తాజా గా చేసిన ప్రకటనలో ప్రజలు అందరూ కూడా తప్పక మాస్క్, భౌతిక దూరం పాటించాలని సూచించింది. మాస్క్ ధరించకపోతే.. కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది.
అయితే మహా రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి.. మాస్క్ తప్పని సరి కాదని ప్రకటించింది. మాస్క్ ధరించని వారిపై ఎలాంటి చర్యలు తీసుకోమాని తెలిపింది. అతి త్వరలోనే మస్క్ లు లేకుండానే ముంబై నగరంలో తిరగవచ్చని ప్రకటించింది.
కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. కాగ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ముంబై నగర వాస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగ మరో రెండు రోజుల్లో మహారాష్ట్రలో పలు స్టేడియాల్లో ఐపీఎల్ నిర్వహించనున్నారు. అయితే ఐపీఎల్ నిర్వహణకు మరికొన్ని సడలింపులు వచ్చే అవకాశం ఉంది.