కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణపై ఆ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసింది. గాంధీభవన్‌లో ఆదివారం ఉదయం నిర్వహించిన మల్కాజ్‌గిరి పార్లమెంటరీ నియోజకవర్గం సమీక్షలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ కుంతియాపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కారణంతో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సర్వేను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వూలు జారీ చేసింది.
ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో సర్వే కంటోన్మెంట్ స్థానం నుంచి బరిలో దిగి ఆయన ఓటమి పాలయ్యారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కుంతియా తమాషా చూస్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పార్టీ ఘోర ఓటమికి కారణమైన వారే సమీక్ష చేస్తారా? అంటూ మండిపడ్డారు. సర్వే వ్యాఖ్యలతో పుండు మీద కారం జల్లినట్లుంది తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి.