షార్ట్ ఫిలింలను తీసేవారి సంఖ్య నేడు ఎంతలా పెరిగిపోయిందో అందరికీ తెలిసిందే. చాలా మంది తమ మనస్సులో ఉన్న ఆలోచనలకు దృశ్య రూపం ఇస్తున్నారు. వాటిని షూట్ చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసి ఓవైపు డబ్బు సంపాదించడమే కాక, మరోవైపు తమ అభిరుచులను, హాబీలను నెరవేర్చుకుంటున్నారు. ఇక మరికొందరు ఫొటోగ్రఫీ పట్ల ఆసక్తి చూపుతున్నారు. అయితే కొంచెం ఆసక్తి చూపించాలే కానీ ఈ రెండు వృత్తుల్లో సెటిల్ అవడం పెద్ద సమస్యేమీ కాదు. ఈ క్రమంలోనే అలా సెట్ అవ్వాలనుకునే వారి కోసం కింద రూ.50వేల లోపు లభిస్తున్న 5 ఉత్తమ డీఎస్ఎల్ఆర్ కెమెరాల వివరాలను అందజేస్తున్నాం. పైన చెప్పిన రెండు వృత్తులలో కెరీర్ ప్రారంభించాలనుకునే వారికి ఈ కెమెరాలు చక్కగా పనిచేస్తాయి. మరి ఆ కెమెరాలు ఏమిటో ఓ లుక్కేయండి..!
1. కెనాన్ ఈవోఎస్ 200డి
ఇందులో 24.2 మెగాపిక్సల్ కెమెరా సెన్సార్ ఉంది. ఫుల్ హెచ్‌డీ రిజల్యూషన్‌తో వీడియోలు తీసుకోవచ్చు. ఇమేజ్‌లను వేగంగా ప్రాసెస్ చేసే డిజిక్ 7 ఇమేజ్ ప్రాసెసర్‌ను ఇందులో ఏర్పాటు చేశారు. దీనివల్ల ఫొటోలను వేగంగా స్నాప్ చేయవచ్చు. ఈ కెమెరా ధర రూ.40,950 గా ఉంది.
2. సోనీ ఆల్ఫా ఎ68
ఇందులో కూడా 24.2 మెగాపిక్సల్ కెమెరా సెన్సార్ ఉంది. ఇమేజ్‌లను ప్రాసెస్ చేసేందుకు బయాంజ్ ఎక్స్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. 2డి, 3డి, 4డి ట్రాకింగ్ ఇందులో లభిస్తోంది. రూ.42,400 ధరకు ఈ కెమెరాను కొనుగోలు చేయవచ్చు.
3. కెనాన్ ఈవోఎస్ 750డి
ఇందులోనూ 24.2 మెగాపిక్సల్ కెమెరా సెన్సార్ ఉంది. 3 ఇంచుల టచ్ స్క్రీన్ ఎల్‌సీడీని ఈ కెమెరాపై ఏర్పాటు చేశారు. రూ.49,757 ధరకు ఈ కెమెరా లభిస్తోంది.
4. నికాన్ డి5600
ఈ కెమెరాలో 24.2 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఏపీఎస్-సి సైజ్ సెన్సార్ అవడం వల్ల ఇమేజ్‌లు షార్ప్‌గా వస్తాయి. ఈ కెమెరా ధర రూ.43,999.
5. నికాన్ డి5300
ఈ కెమెరాలో 24.2 మెగాపిక్సల్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. ఎక్స్‌పీడ్ 4 ప్రాసెసర్‌ను ఈ కెమెరాలో ఏర్పాటు చేశారు. హెచ్‌డీ క్వాలిటీ ఉన్న ఫొటోలను ఈ కెమెరాతో తీసుకోవచ్చు. 3.2 ఇంచ్ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఇందులో ఉంది. ఈ కెమెరా ధర రూ.42,950.