పొత్తు బీజేపీతోనో, టీడీపీతోనే అనేది పవనే చెప్పాలి : సత్య కుమార్‌

-

బీజేపీ జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్ ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనసేన-టీడీపీ భాగస్వామ్యం అంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పదే పదే ప్రస్తావిస్తుండడం పట్ల ఆయన స్పందించారు. ఏపీలో ఏ పార్టీతో పొత్తు ఉందో పవన్ కల్యాణ్ స్పష్టత ఇవ్వాలని సత్యకుమార్ పేర్కొన్నారు. పొత్తు బీజేపీతోనో, టీడీపీతోనో అనేది పవనే చెప్పాలని స్పష్టం చేశారు. విజయవాడలోని ఖాదీ గ్రామోద్యోగ్ ఎంపోరియాన్ని ఆయన ఇవాళ సందర్శించారు.

Satyakumar: వడ్డీ లేని రుణం వద్దని.. భారీ వడ్డీలకు అప్పులు తెస్తారా?:  సత్యకుమార్‌ | bjp national secretary satya kumar fires on ap govt

ఇది ఇలా ఉంటె, కుల గణన చేసిన తొలి రాష్ట్రంగా బీహార్ చరిత్రకు ఎక్కింది. ఈ దేశంలో 143 కోట్ల మంది పౌరులు ఉన్నారు. అయితే ఫలనా జనాభా అధికం అని అనుకోవడమే తప్ప కచ్చితమైన లెక్కలు అయితే లేవు. కానీ ఫస్ట్ టైం బీహార్ లో ఓబీసీలు 67 శాతం పైగా ఉన్నారంటూ కుల గణన చేసి మరీ అక్కడి నితీష్ కుమార్ ప్రభుత్వం లెక్క తేల్చింది. దీనికి రాహుల్ గాంధీ సమర్ధిస్తూ నేరుగా ప్రధాని మోడీని బీజేపీని టార్గెట్ చేశారు. ప్రధాని వద్ద 90 మంది కార్యదర్శులు ఉంటే ఓబీసీలు జస్ట్ ముగ్గురే ఉన్నారు, ఇదేనా అభివృద్ధి సమానత్వం అంటూ నిందించారు. ఈ దేశంలో ఎందుకు కుల గణన చేయలేకపోయారు అని ప్రశ్నించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే దేశమంతా కుల గణన చేస్తామని ఆయన ప్రకటించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news