యాక్టర్ సత్యదేవ్ ఎమోషనల్.. మిస్టర్ పర్ఫెక్ట్ ని గుర్తు చేసుకుంటూ..

ప్రభాస్ హీరోగా వచ్చిన మిస్టర్ పర్ఫెక్ట్ ఎంత పెద్ద హిట్టో చెప్పాల్సిన పనిలేదు. దశరథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ప్రభాస్ లవ్ స్టోరీలు చేయగలడా అని సందేహిస్తున్న సమయంలో తనలోని రొమాంటిక్ యాంగిల్ తో మరిపించి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ప్రస్తుతం ఆ సినిమా రిలీజై పదేళ్ళు అయ్యింది. ఈ సందర్భంగా యాక్టర్ సత్యదేవ్ ఎమోషనల్ కి గురయ్యాడు. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాకి పదేళ్ళు పూర్తయితే సత్యదేవ్ ఎందుకు ఎమోషనల్ అయ్యాడని అనుకుంటున్నారా?

ఎందుకంటే ఆ సినిమాలో సత్యదేవ్ కూడా నటించాడు కాబట్టి, అవును.. ప్రభాస్ ఫ్రెండ్స్ గా నటించిన వారిలో సత్యదేవ్ కూడా ఒకడు. చాలా కొద్దిసేపు మాత్రమే కనిపించే సత్యదేవ్ కి మిస్టర్ పర్ఫెక్ట్ మొదటి చిత్రం. అసలు గుర్తుపట్టడానికి కూడా సమయం లేని క్యారెక్టర్ లో సత్యదేవ్ కనిపించాడు. ఈ రోజు మిస్టర్ పర్ఫెక్ట్ రిలీజై పదేళ్లయిన సందర్భంగా ఆ పాత్రని గుర్తు చేసుకుని, తనని ఇంతదూరం తీసుకొచ్చిన దర్శకులకు, ప్రేక్షకులకు దన్యవాదాలు తెలుపుకున్నాడు.