సత్యదేవ్ “కృష్ణమ్మ” టైటిల్ సాంగ్ రిలీజ్

-

ఫలితంతో సంబంధం లేకుండా కంటెంట్ ప్రధానంగా ఉన్న కదలను ఎంచుకుంటూ హీరోగా వైవిధ్యతను చాటుకుంటున్నాడు టాలీవుడ్ హీరో సత్యదేవ్. హీరో గానే కాకుండా పాత్ర నచ్చితే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటిస్తూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈయన కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ” కృష్ణమ్మ”. కృష్ణ కొమ్ములపాటి నిర్మాణంలో గోపాలకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. సత్యదేవ సరసన అధిర రాజి హీరోయిన్ గా నటించింది.

కొరటాల శివ సమర్పిస్తున్న ఈ సినిమాకి కాలభైరవ సంగీతాన్ని సమకూర్చాడు. తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ” కృష్ణమ్మా కృష్ణమ్మా నీలాగే పొంగిందమ్మ మాలో సంతోషం. ఈ కొమ్మ ఆ రెమ్మ చల్లాయి గందాలేవో మాపై ఈ నిమిషం.” అంటూ ఈ పాట సాగుతుంది. అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ టైటిల్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news