మోడీ అహంకారి అంటూ మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాశంగా మారుతుంది. అయితే మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సాగు చట్టాల రద్దు చేయక ముందు.. ప్రధాని మోడీతో రైతు మరణాలపై చర్చించానని చెప్పే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో లో మోడీని సత్యపాల్ మాలిక్ అహాంకారి అంటు వ్యాఖ్యానించారు.
రైతు మరణాలపై చర్చించే సమయంలో ప్రధాని మోడీ.. రైతులు తన కోసం చనిపోలేదని అంటు అహంకారిగా మాట్లాడారని సత్యపాల్ మాలిక్ అన్నారు. అంతే కాకుండా అహంకారంతో మాట్లాడారని కూడా ఆ వీడియోలో అన్నారు. అయితే సత్యపాల్ మాలిక్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద దూమరం అవుతుంది. కాంగ్రెస్ ట్విట్టర్ లో షేర్ చేశారు. అలాగే సత్యపాల్ మాలిక్ వ్యాఖ్యలతో మోడీ నిజ స్వరూపం మరో సారి బయట పడ్డదని అంటు ఆగ్రహించారు. కాంగ్రెస్ తో పాటు పలు విపక్ష పార్టీలు కూడా మోడీ పై ధ్వజమెత్తుతున్నారు.
घमंड…क्रूरता…संवेदनहीनता
भाजपा के राज्यपाल के इस बयान में पीएम मोदी के व्यक्तित्व में शामिल इन्हीं 'गुणों' का बखान है।
मगर, ये एक लोकतंत्र के लिए चिंता की बात है। pic.twitter.com/HGxzKfYsme
— Congress (@INCIndia) January 3, 2022