SBI అకౌంట్ క్లోజ్.. ఖాతాదారులకు అలర్ట్…!

-

మీకు స్టేట్ బ్యాంక్ లో అకౌంట్ ఉందా..? అయితే మీరు కచ్చితంగా దీనిని తెలుసుకోవాలి. దేశీయ దిగ్గజ బ్యాంక్ తాజాగా కస్టమర్స్ కోసం ఒక విషయాన్ని తెలిపింది. స్టేట్ బ్యాంక్ లో ఖాతా వున్న వాళ్లు అది తెలుసుకోవాలి. ఈ మధ్య కాలం లో మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే ఈ మోసాలు గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

SBI
SBI

ప్రతి రోజు ఏదో ఒకటి మనం చూస్తూనే ఉంటాం. ఇది ఇలా ఉంటే కచ్చితంగా మాత్రం ఈ ఒక్క విషయం తెలుసుకోవాలి. ఆన్‌లైన్ మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఎస్‌బీఐ కస్టమర్లు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీరు ఇబ్బంది పడక తప్పదు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఎస్‌బీఐ యోనో బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయిపోందనే మెసేజ్‌లు ఇప్పుడు కస్టమర్లకు వెళ్తున్నాయి. అయితే ఇవి బ్యాంక్ పంపడం లేదు. కనుక కస్టమర్స్ ఈ విషయాన్నీ గ్రహించాలి.

లేదంటే బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయిపోయే ప్రమాదముంది. బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయ్యిందని మెసేజ్ వస్తుంది. లింక్‌పై క్లిక్ చేసి నెట్ బ్యాంకింగ్ లోని లాగిన్ అయ్యి పాన్ కార్డు వివరాలు అప్‌డేట్ చేయాలని మెసేజ్‌లో ఉంటుంది. లింక్‌పై క్లిక్ చేసి వివరాలు అందిస్తే నష్ట పోతారు.

అందుకనే అలాంటి వాటిని వస్తే పట్టించుకోకండి. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా ఈ అంశంపై స్పందించింది ఇలాంటి మెసేజ్‌లను స్టేట్ బ్యాంక్ పంపించడం లేదని స్పష్టం చేసింది. అందువల్ల బ్యాంక్ కస్టమర్లు ఇలాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలని అంది.

Read more RELATED
Recommended to you

Latest news