తస్మాత్ జాగ్రత్త.. క్యూఆర్ కోడ్ తో మోసాలు..!

-

ఈ మధ్య ఆన్ లైన్ ట్రాన్సక్షన్స్ చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేయడంలో ప్రయోజనాలు చాలా వున్నాయి. అలానే ఇబ్బందులు కూడా వున్నాయి. ఆన్‌లైన్ పేమెంట్లు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా ఆన్‌లైన్ పేమెంట్ లేదా మొబైల్ పేమెంట్ చేసారు అంటే డబ్బులని కోల్పోవాల్సి వస్తుంది.

 

అలానే క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేసే ముందు అప్రమత్తంగా ఉండాలి. మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేసేముందు అప్రమత్తంగా ఉండాలి అని దేశంలో అతి పెద్ద ప్రభుత్వం రంగ బ్యాంకు ఎస్‌బీఐ తన కస్టమర్లను అభ్యర్థిస్తోంది. డబ్బులు పొందడం కోసం క్యూఆర్ కోడ్‌‌ను స్కాన్ చేయొద్దని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా కస్టమర్స్ కి చెప్పింది.

క్యూఆర్ కోడ్ తో డబ్బులు చెల్లిస్తామని.. పొందడం కోసం కాదని అంది. క్యూఆర్ కోడ్‌ అనేది క్విక్ రెస్పాన్స్ కోడ్. పాయింట్ ఆఫ్ సేల్ వద్ద మొబైల్ పేమెంట్లను చేసుకునేందుకు దీనిని ఉపయోగించడం జరుగుతుంది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే ముందు అలర్ట్‌గా ఉండండి! స్కాన్ చేసే ముందు ఆలోచించండి, తెలియని, ధ్రువీకరణ లేని క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చెయ్యద్దని.. అలెర్ట్ గా ఉండాలని స్టేట్ బ్యాంక్ అంటోంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news