నేటి నుంచి తెలంగాణలో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. గత వారం రోజులు తెలంగాణ రాష్ట్రంలో విద్యాసంస్థలు అన్నియూ మూత పడ్డాయి. తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు విద్యాసంస్థలు అన్నియూ మూత పడ్డాయి. ఈ నెల 11, 12, 13 తేదీల్లో మొదటగా.. టీఆర్‌ఎస్ సర్కార్.. భారీ వర్షాలను దృష్టి ఉంచుకుని.. సెలవులు ప్రకటించింది.
అయినా.. వర్షాలు తగ్గకపోవడంతో.. 14, 15, 16 తేదీల్లోనూ సెలవులు ప్రకటించింది. ఇక 17 వ తేదీన ఆదివారం కాబట్టి సెలవు ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా వర్షాలు ఆగిపోయాయి. దీంతో ఇవాళ పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. మరోసారి సెలవుల గడువు పెంచుతున్నామని ప్రభుత్వం ఎక్కడా చెప్పక పోవడంతో… నేటి నుంచి యథావిధంగా తెలంగాణలో పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. దీంతో విద్యార్థులందరూ పాఠశాలలకు వెళుతున్నారు.