గుడ్ న్యూస్‌.. హెచ్ఐవీ ఎయిడ్స్‌కు మెడిసిన్‌..!

-

హెచ్ఐవీ ఎయిడ్స్‌కు మందు దొరికిన‌ట్లేనా..? అంటే.. అందుకు అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. ఎయిడ్స్ బారిన ప‌డ్డ ఓ వ్య‌క్తికి సైంటిస్టులు ప‌లు మెడిసిన్ల‌తో చికిత్స ఇవ్వ‌గా.. అత‌ను విజ‌య‌వంతంగా ఆ వ్యాధి నుంచి బ‌య‌ట ప‌డ్డాడు. ఈ మేర‌కు 23వ ఇంటర్నేష‌న‌ల్ ఎయిడ్స్ కాన్ఫ‌రెన్స్ (ఎయిడ్స్ 2020)లో సైంటిస్టులు త‌మ ప‌రిశోధ‌న‌ల‌కు సంబంధించిన వివ‌రాల‌ను వెల్ల‌డించారు.

scientists found cure for HIV AIDS

2012లో హెచ్ఐవీ బారిన ప‌డ్డ ఓ వ్య‌క్తి 2016లో సైంటిస్టులు నిర్వ‌హించిన క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌లో త‌న పేరు న‌మోదు చేసుకున్నాడు. ఈ క్ర‌మంలో అత‌నికి 48 వారాల పాటు dolutegravir, maraviroc అనే రెండు మెడిసిన్ల‌ను నిత్యం రెండు సార్లు 500 మిల్లీగ్రాముల మోతాదులో ఇచ్చారు. అలాగే విట‌మిన్ బి3 పిల్స్‌ను కూడా ఇచ్చారు. అనంత‌రం మార్చి 2019లో అత‌నిపై క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ ఆపేశారు. త‌రువాత 57 వారాల పాటు ప్ర‌తి 3 వారాల‌కు ఒక‌సారి ఆ వ్య‌క్తిలో ఉన్న వైర‌ల్ డీఎన్ఏ గురించి తెలుసుకునేందుకు టెస్టులు చేశారు. ఈ క్ర‌మంలో 57 వారాల అనంత‌రం అత‌నిలో హెచ్ఐవీ యాంటీ బాడీలు లేవ‌ని తేలింది. అంటే.. ఆ వ్య‌క్తి పూర్తిగా హెచ్ఐవీ నుంచి కోలుకున్నాడ‌న్న‌మాట‌.

అయితే కేవ‌లం ఈ ఒక్క వ్య‌క్తిపై మాత్ర‌మే ప్ర‌యోగం విజ‌య‌వంతం అయింది. అందువ‌ల్ల ఇప్పుడ‌ప్పుడే ఆయా మెడిసిన్ల‌ను ఎయిడ్స్ చికిత్స కోసం వాడ‌లేమ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. వాటిపై మ‌రిన్ని ప్ర‌యోగాలు చేయాలంటున్నారు. అవి కూడా విజ‌య‌వంతంగా పూర్త‌యితే హెచ్ఐవీ ఎయిడ్స్‌కు మెడిసిన్ వ‌చ్చిన‌ట్లే అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news