ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ను పండ్లు, కూరగాయలే తగ్గించగలవని నిరూపించిన శాస్త్రవేత్తలు..

-

మహిళలకు రొమ్ము క్యాన్సర్‌ ఎక్కువగా వస్తుంది.. అలాగే మగవాళ్లకు ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ ఎక్కువగా వస్తుంది. యాభై ఏళ్లు దాటిన వారిలో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రొస్టేట్ అనేది మగవారికి మాత్రమే ఉంటుంది. పునరుత్పత్తిలో ఇదొక ముఖ్యమైన భాగం. మూత్రాశయం కింద ఉంటుంది. దీనికి క్యాన్సర్ సోకితే పునరుత్పత్తి వ్యవస్థతో పాటు మూత్రాశయ వ్యవస్థ కూడా దెబ్బతింటుంది.. అయితే ఈ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి పండ్లు, కూరగాయలతో కూడిన ఆహారం చక్కగా పని చేస్తుందని సౌత్ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయ పరిశోధకులు వెల్లడించారు.

అధ్యయనం ఇలా చేశారు..

ప్రొస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న 116 మంది పురుషులు, ఈ క్యాన్సర్ తగ్గిన 132 మంది పురుషుల నుంచి ప్లాస్మా నమూనాలను తీసుకున్నారు. ప్రొస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న పురుషుల్లో సెలీనియం మూలకంతో పాటు లుటిన్, లైకోపీన్, ఆల్ఫా కెరోటిన్, బీటా కెరోటిన్ అనే సూక్ష్మ పోషకాల సాంద్రత తక్కువగా ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. ఇవి పండ్లు, కూరగాయల్లో అధికంగా లభిస్తాయి. సెలీనియం తెల్ల మాంసం, చేపలు, షెల్ఫిష్, గుడ్లు, గింజల్లో కనిపిస్తుంది.

సహజంగా లైకోపీన్ టమోటాలు, సీతాఫలాలు, ద్రాక్ష, పీచెస్, పుచ్చకాయలు, కాన్ బెర్రీస్‌లో ఉంటుంది. సెలీనియం అధికంగా ఉండే ఆహారాలతో పాటు రంగు రంగుల మొక్కల ఆధారిత ఆహారాలు, ఆరోగ్యకరమైన కొవ్వులను తీసుకుంటే మంచిదని పరిశోధకులు సిఫార్సు చేస్తున్నారు. పెద్దలు రోజుకి 1 ½ కప్పు నుంచి 2 కప్పుల వరకు పండ్లు, 2 నుంచి 3 కప్పుల వరకు కూరగాయలు తింటే ఈ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఈ క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే తగ్గిపోతుంది. లేదంటే పక్క అవయవాలకు కూడా పాకి ప్రాణాంతకం కూడా కావొచ్చు. ఎందుకంటే ప్రొస్టేట్ క్యాన్సర్ నిశ్శబ్ద క్యాన్సర్. చాలా వరకు అన్ని క్యాన్సర్లు అంతే.. రోగం ముదిరితేకానీ క్లియర్‌గా బయటపడవు.. శరీరంలోని హార్మోన్ల అసమతుల్యతకి తగినట్టు ప్రభావితమవుతుంది. అందుకే హార్మోన్ల అసమతుల్యత రాకుండా చూసుకోవాలి. ఆవుపాలలో ఈస్ట్రోజెన్ అధికంగా ఉంటుంది. ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే మగవాళ్ళు ఆవు పాలకు దూరంగా ఉండాలి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకుంటే దీని బారిన పడకుండా ఉండవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news