ఈ సంకేతాలు ఉన్నాయా..? అయితే పోషకాహార లోపమే..!

-

చాలా మంది రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి పోషకాహార లోపం ఏమో అని సందేహం కలుగుతూ ఉంటుంది. మనం తీసుకునే డైట్ లో అన్ని రకాల పోషక పదార్థాలు ఉండేటట్టు చూసుకోవాలి అన్ని రకాల పోషకాలు కనుక డైట్ లో లేకపోతే దాని వలన పోషకాహార లోపం కలుగుతుంది. పోషకాహార లోపం తో మీరు బాధపడుతున్నారా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి..?

ఎటువంటి సంకేతాలు కనపడతాయి అనే విషయాన్ని చూద్దాం. ఈ మధ్యకాలంలో చాలా మంది సమయం లేక మంచి ఆహారాన్ని తీసుకోలేకపోతున్నారు. అలానే పని ఒత్తిడి కారణంగా ఇబ్బంది పడుతున్నారు. సరైన ఆహారం తీసుకుంటే శారీరికంగా మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఒకవేళ కనుక సరైన ఆహారం తీసుకోకపోతే శారీరకంగా మానసికంగా కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది.

పోషకాహార లోపం ఉంటే జుట్టు రాలిపోతుంది. జుట్టు రాలిందంటే పోషకాహార లోపం ఉన్నట్లే ఐరన్ ప్రోటీన్ శరీరానికి సరిపడా అందకపోతే జుట్టు బాగా రాలిపోతుంది. అలానే నోటి దుర్వాసన కూడా పోషకాహార లోపానికి సంకేతమే. పోషకాహార లోపం కనుక ఉన్నట్లయితే నోటి దుర్వాసన సమస్య ఎక్కువ అవుతుంది. జీర్ణ సమస్యలు కూడా పోషకాహార లోపం వలన కలుగుతాయి.

మలబద్ధకం జీర్ణ సమస్యలు వంటివి పోషకాహార లోపం వలన వస్తాయి. పోషకాహార లోపం ఉంటే చిగుళ్ళు సమస్యలు కూడా ఉంటాయి. నోటిపూత చివర్లో పుండ్లు రావడం వంటివి కూడా జరుగుతాయి. పోషకాహార లోపం కనుక ఉంటే చర్మ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది చర్మ ఆరోగ్యం దెబ్బతింటే కూడా అది పోషకాహారం లోపం అని మీరు గ్రహించవచ్చు. ఎక్కువగా అలసిపోతుంటే కూడా పోషకాహార లోపం అని గమనించాలి.

Read more RELATED
Recommended to you

Latest news