వన్ డే వరల్డ్ క్వాలిఫైయర్స్ లో సూపర్ సిక్స్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. కాగా ఈ సిరీస్ లో ఒక ఆటగాడు మాత్రం పరుగుల వరద పారిస్తున్నాడు. జింబాబ్వే సీనియర్ ప్లేయర్ సీన్ విలియమ్స్ టాక్ అఫ్ ది క్రికెట్ గా మారాడు. ఈ సిరీస్ లో సీన్ విలియమ్స్ ఆడిన అయిదు మ్యాచ్ లలో 3 సెంచరీలతో కలుపుకుకి 532 పరుగులు చేశాడు. ఇందులో ఇతని స్ట్రైక్ రేట్ 149 గా ఉంది. ఇక ఇప్పటి వరకు వరుసగా 5 మ్యాచ్ లలో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలోకి చేరిపోయాడు. అలా చూసుకుంటే ఇండియా తరపున విరాట్ కోహ్లీ వరుసగా 5 మ్యాచ్ లలో చేసిన మొత్తం పరుగులలో 596 తో మొదటి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ 537 పరుగులతో రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు.
ఇప్పుడు జింబాబ్వే నుండి సీన్ విలియమ్స్ 532 పరుగులతో మూడవ స్థానానికి చేరుకున్నాడు. నాలుగు మరియు అయిదు స్థానాలలో హేడెన్ (529) ఫకర్ జమాన్ (515) లు ఉన్నారు.