యంగ్ హీరో తేజ సజ్జా మరియు విభిన్న కథాంశాలను తెరకెక్కించే దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో వస్తున్న రెండవ చిత్రం “హనుమాన్”. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా వస్తున్న ప్రతి అప్డేట్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతూ ఉంది. ఇప్పుడు తాజాగా మరో అప్డేట్ ను చిత్ర బృందం రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకుంది. ఆ సమాచారం ప్రకారం హనుమాన్ మూవీ రిలీజ్ డేట్ ను రేపు ఉదయం 10 .08 గంటలకు రిలీజ్ చేయనుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి మైలేజ్ తీసుకువచ్చింది.
కాగా ఈ సినిమాలో తేజ సజ్జ, వరలక్ష్మి శరత్ కుమార్, అమృత, వినయ్ రాయ్ మరియు తదితరులు నటించారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూసేవారికి రేపు సమాధానం దొరకనుంది.