ఏపీలో జోరుగా డబ్బు పంపిణీ.. ఎస్ఈసీ కీలక సమావేశం !

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ పై రాష్ట్ర ఎన్నికల సంఘం నిఘా పెట్టింది. ఈ ఎన్నికల కోడ్ ఉల్లంఘనల పై పలు ఫిర్యాదులు వస్తున్నాయి అని ఎస్ఈసీ పేర్కొంది. వైజాగ్, విజయవాడ, గుంటూరు, తిరుపతి కార్పొరేషన్ ల విషయంలో ఎస్ఈసీ ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు చెబుతున్నారు. ఇక సంబంధిత అధికారులతో 11 గంటలకు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. 

ఇక మున్సిపల్ ఎన్నికల నేపధ్యంలో ప్రధాన పార్టీ మధ్య రసవత్తరంగా రాజకీయాలు నడుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 75 మున్సిపాలిటీలు, 12 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ ఎన్నికల ప్రక్రియను.. ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ నుంచి మొదలు పెట్టారు. మార్చి 10వ తేదీ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 14వ తేదీన ఓట్ల కౌంటింగ్ ఉంటుంది.