ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ

-

రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కృష్ణానదికి వరద పొటెత్తుతోంది. ఓ వైపు కృష్ణా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ఏపీలో తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. ఇప్పటికే తెలంగాణలోని అన్ని ప్రాజెక్టులు నిండుకుండలా దర్శనమిస్తున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యామ్స్ వద్ద ప్రమాదకర స్థాయిలో వరద ఉధృతి కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టుల గేట్లను ఇప్పటికే ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.

ఈ క్రమంలోనే ప్రకాశం బ్యారేజీకి ప్రమాదకర స్థాయిలో వరద పోటెత్తుతోంది. దీంతో బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ ప్రాంతాలు, ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరద కారణంగా ప్రాజెక్టు గేట్లను ఎత్తి 5,67,360 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నదీ పరివాహాక, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మరో రెండ్రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఇప్పటికే ఏపీలో స్కూళ్లకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో ప్రయాణాలు కూడా మానుకోవాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news