ఏపీలో రెండో డోస్ గందరగోళం

-

అమరావతి: ఏపీలో 45 ఏళ్ల దాటిన వారందరికి కరోనా వ్యాక్సిన్ ఇస్తున్న విషయం తెలిసిందే. తొలి డోస్ ఇప్పటికే పూర్తి చేశారు. తాజా రెండో డోస్ కష్టాలు ఏర్పడ్డాయి. కేంద్రం నుంచి రావాల్సిన  పూర్తి స్తాయిలో రావాల్సిన వ్యాక్సిన్లు ఇప్పటివరకూ రాలేదే. దీంతో సమస్య తీవ్రత మరింత ఎక్కువయింది. తొలి డోస్ వేసుకుని రెండో డోస్ వేసుకోవడానికి ప్రజలు టీకా కేంద్రాల వద్దకు పోటెత్తారు. రెండో డోస్ కావాలంటూ అక్కడి సిబ్బందిని నిలదీస్తున్నారు. అంతేకాదు వాగ్వాదానికి దిగుతున్నారు. వ్యాక్సిన్ కొరతతో టీకాలు అనుకున్న సమయానికి ఇవ్వలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు వైద్యారోగ్య శాఖ అధికారులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. కేంద్రం నుంచి వ్యాక్సిన్ వస్తే పంపిణీ జరుగుతుందని అంటున్నారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news