మ్యూకర్మైకోసెస్ అంటే ఏమిటి…? దీని వలన ప్రాణానికి ప్రమాదమా..?

-

కరోనా వైరస్ తగ్గి రికవరీ అయ్యే పేషెంట్స్ లో మ్యూకర్మైకోసెస్ అని ఒక ప్రమాదకరమైన ఫంగల్ ఇన్ఫెక్షన్ వ్యాపిస్తోంది అని చెప్పడం జరిగింది. అయితే గత సంవత్సరం కరోనా వైరస్ ఫస్ట్ వేవ్ లో కూడా చాల మందిఈ సమస్యతో బాధ పడ్డారని… కొందరు చూపు కోల్పోయారని చెప్పారు. SGRH హాస్పిటల్ లో గత రెండు రోజుల్లో ఆరుగురు మందికి మ్యూకర్మైకోసెస్ వచ్చిందని వెల్లడించారు.

అయితే మరోసారి మనం ఇటువంటి ప్రమాదకరమైన వ్యాధులు చూస్తున్నామని అన్నారు. దీనిని జైగో మైక్రోసెస్ అని కూడా అంటారు అని అంటారు. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం ఇటువంటి ప్రమాదకరమైన వ్యాధి mucormycoses కారణంగా వస్తుందని ఇవి మామూలుగానే పర్యావరణంలో ఉంటాయని.. రోగ నిరోధక శక్తి పై ప్రభావం చూపిస్తాయని ఊపిరితిత్తులు మరియు సైనస్ ని ఎఫెక్ట్ చేస్తాయని అంటున్నారు.

ఈ ఫంగస్ గాయాల కారణంగా కూడా లోపలికి వెళ్లి పోవచ్చు అని అంటున్నారు చాలా మందిలో ఈ ఫంగస్ వలన ఏ ఇబ్బంది ఉండదని రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ రావచ్చని అంటున్నారు. అయితే ఈ మ్యుకరమైకోసిస్ ఒకరి నుంచి మరొకరికి సోకదు. అంటే ఒకరి నుంచి వేరే మనిషికి కానీ జంతువు కానీ అంటుకోదు అని చెప్తున్నారు.

శ్రీ గంగా రామ్ హాస్పిటల్ ఈఎంటీ డిపార్ట్మెంట్ కొవిడ్-19 పేషెంట్లు ఇమ్యూనిటీ తక్కువగా ఉండే వాళ్లలో ఎక్కువగా బ్లాక్ ఫంగల్ మ్యుకరమైకోసిస్ వస్తోందని అంటున్నారు. అదే విధంగా కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ సోకడం వల్ల స్టెరాయిడ్స్ వాడకం వలన వాళ్ళలో డయాబెటిస్ వచ్చిందని అంటున్నారు.

దీని కారణంగా కూడా బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. గత సంవత్సరం కళ్ళు ఉబ్బడం, బుగ్గలు వేయడం, ముక్కులో ఇబ్బందిగా ఉండటం లక్షణాలుగా గుర్తించారు. మీడియా రిపోర్టుల ప్రకారం గత సంవత్సరం గుజరాత్ అహ్మదాబాద్ మరియు కర్ణాటక లో ఈ రోగులని గుర్తించారు. అహ్మదాబాద్లో ఐదుగురు ఈ సమస్యతో బాధపడుతున్నారు అని అన్నారు. మీడియా రిపోర్టుల ప్రకారం ఈ ఐదుగురిలో ఇద్దరూ కంటి చూపు ని కోల్పోయినట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news