కార్తీక దీపం వెనుక సైన్స్ ఉందట..!

-

మాసాలల్లో ప్రత్యేకమైన మాసం కార్తీకం. దీపావళి నుంచి ప్రారంభమైన దీపాల వెలుగులు కార్తీకం మొత్తం కొనసాగుతుంది. దీని వెనుక ఉన్న సైన్స్ ఉందా.. అంటే అవును అంటున్నారు పలువురు శాస్త్రవేత్తలు. శరత్‌కాలం చివరిదశకు రావడంతోపాటు వాతావరణంలో చలి తీవ్రత చిన్నగా పెరుగుతుంది. ఈ సమయంలో శరీరంలో నాడుల్లో కొవ్వు పెరిగుతుంది. ముఖ్యంగా రక్తనాళాల్లో కొవ్వు పెరిగి హృదయసంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో దీపాలు వెలిగించి వాటి ద్వారా వెలువడే కాంతి, వాయువుల ద్వారా శరీరంలో కొవ్వు కరిగి ప్రమాదాల నుంచి రక్షిస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. దీపాన్ని స్వచ్ఛమైన ఆవునెయ్యి లేదా నువ్వుల నూనెలను ఉపయోగిస్తే ఫలితం మంచిగా ఉంటుంది.

Secret Behind Karthika Deepam

ఈ రెండు పదార్థాల ద్వారా దీపం వెలిగిస్తే అవి వెదజల్లే కాంతి, వాయువుల్లో ఉండే శక్తి మనల్ని కాపాడుతుంది. ఆధ్యాత్మికవేత్తలు చెప్పేదాని ప్రకారం హృదయానికి శని అధిపతి. ఆయన ప్రీతిచెందడానికి పై రెండు ద్రవాలను ఉపయోగించి దీపాలు పెడితే మంచిది. దీపాలను తెల్లవారు ఝామున స్నానానంతరం తులసి, దేవాలయాలు, ఉసిరి చెట్టు దగ్గర, ఇంట్లో దేవుని సన్నిధిలో పెట్టాలి. లేదా అసుర సంధ్యవేళలో ఇంటి గుమ్మాని ఇరువైపులా, తులసి, ఉసిరి, దేవుని సన్నిధానంలో వెలిగించాలి. దీనివల్ల పితృదేవతలు సంతోషించి వంశవృద్ధిని, ఆయుర్, ఆరోగ్యాలను, ఐశ్వర్యాలను ప్రసాదిస్తారు. దీపం పెట్టిన తర్వాత కొంచెం కుంకుమ, పసుపు, అక్షింతలు లేదా పుష్పాలు వేయాలి. తర్వాత మీ ఇష్టదైవాన్ని దీపంలోకి ఆవాహనం చేసి నమస్కారం చేసుకోవాలి. కృత్రిమ/ఆర్టిఫిషియల్ దీపాలు పెట్టరాదు. మట్టి ప్రమిదల్లో స్వచ్ఛమైన పత్తితో చేసిన వత్తులతో దీపారాధన చేస్తే విశేష ఫలితం వస్తుంది.

– కేశవపంతుల వేంకటేశ్వరశర్మ

Read more RELATED
Recommended to you

Latest news