BREAKING : సికింద్రాబాద్‌ క్లబ్‌ పూర్తిగా మూసివేత

-

సికింద్రాబాద్‌ క్లబ్‌ పూర్తిగా మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది యాజమాన్యం. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు క్లబ్‌ మూసివేస్తున్నట్లు యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేసింది సికింద్రాబద్‌ క్లబ్‌ యాజమాన్యం. మొన్న చోటు చేసుకున్న ఘోర అగ్ని ప్రమాదం లో చాలా ఆస్తి నష్టం జరిగిందని యాజమాన్యం తెలిపింది.

క్లబ్‌ సభ్యులకు సంబంధించిన డేటా సురక్షితంగానే ఉందని… క్లబ్‌ లోని కొల్నాడబార్‌, బిలియర్డ్స్‌ రూం, బాల్‌ రూం, మెయిన్‌ రిసప్షన్‌ నుంచి ఫస్ట్‌ ప్లోర్‌ కు వెళ్లే చెక్క మెట్లు దగ్ధం అయినట్లు వివరించారు. ఈ ప్రమాదం పై వివరాలు తెలిసే వరకు క్లబ్‌ ను మూసి వేస్తున్నట్లు ప్రకటించింది యాజమాన్యం.కాగా.. రెండు రోజుల క్రితం.. సికింద్రాబాద్‌ క్లబ్‌ లో భారీ అగ్ని ప్రమాదం చో టు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. అగ్ని ప్రమాదం లో ఏకంగా రూ. 25 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్లు యాజమాన్యం ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news