త‌న చేతికి మ‌ట్టి అంట‌కుండా జ‌గ‌న్ స‌రిచేస్తున్నారే…!

-

ఏపీ అధికార పార్టీ వైసీపీలో నేత‌ల మ‌ధ్య స‌ఖ్య‌త పెరుగుతోందా?  నాయ‌కులు వైరాలను వీడి.. ఏక‌మ‌వుతు న్నారా?  పార్టీలో సంచ‌ల‌న మార్పుల‌కు అవ‌కాశం క‌నిపిస్తోందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కు లు. పార్టీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యాలు, ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చి.. జ‌గ‌న్ చెంత‌కు చేరేందుకు నాయ‌కులు క్యూ క‌డుతుండ‌డంతో వైసీపీ నేత‌ల్లో అంత‌ర్మ‌థ‌నం ఏర్ప‌డింది. మొద‌ట్లో.. జ‌గ‌న్ వ్యూహాన్ని లైట్‌గా తీసుకున్నారు వైసీపీ నాయ‌కులు. ఆ ఏముంది.. టీడీపీని దెబ్బ‌కొట్టేందుకు  ఆ పార్టీ నేత‌ల‌ను వైసీపీలో చేర్చుకుంటున్నార‌ని చెప్పుకొచ్చారు.

అయితే, అనూహ్యంగా జ‌గ‌న్ వ్యూహం వెనుక‌.. అటు టీడీపీనే కాదు.. ఇటు సొంత పార్టీ నేత‌లు కూడా ఉన్నార‌ని.. తాజాగా తెలిసి ఖంగుతింటున్నారు వైసీపీ నాయ‌కులు. ప్ర‌స్తుతం చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో.. నాయ‌కులు, ఎమ్మెల్యేలు కొట్టుకుంటున్నారు. నువ్వెంత .. అంటే నువ్వెంత‌.. అనే రేంజ్‌లో కీచులాడు తున్నారు. దీంతో పార్టీపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అయితే, వీరిని పిల‌వ‌డం, మాట్లాడ‌డం, పంచాయితీ పెట్ట‌డం వంటివి చేస్తే.. మ‌రింత‌గా ఈ గొడ‌వ‌లు పెరుగుతాయే త‌ప్ప‌.. త‌గ్గ‌వ‌ని అనుకున్న జ‌గ‌న్‌.. వ్యూహా త్మ‌కంగా వారి ర‌గ‌డ‌ల‌ను వారే త‌గ్గించుకునేలా వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతున్నారు.

ఈ క్ర‌మంలోనే టీడీపీ నుంచి నేత‌ల‌ను చేర్చుకుంటున్నారు. ఇది వైసీపీ నేత‌ల గుండెల్లో రైళ్ల‌ను ప‌రిగెట్టి స్తోంది. దీంతో ఎక్క‌డిక‌క్క‌డ నాయ‌కులు సెట్‌రైట్ అవుతున్నారు. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనూ నాయ‌కులు స‌ర్దుకుంటున్నారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కూడా ఒక‌రిపై ఒక‌రు పైచేయి సాధించిన గుంటూరులోని వైసీపీ నాయ‌కులు.. ఇప్పుడు ఫోన్లు చేసి ప‌ల‌క‌రించుకుంటున్నారు.

పార్టీని స‌జావుగా ముందుకు తీసుకువెళ్లాల‌నే ల‌క్ష్యంతో ఉన్న‌ట్టు తెలుస్తోంది.  తాజాగా మారిన పార్టీ వ్యూహంతో.. నేత‌లు కొట్టుకోవ‌డం త‌గ్గించి.. క‌లుసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. లేక‌పోతే.. మొత్తానికి ఎస‌రు ఎదుర‌య్యే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు. ఏదేమైనా.. త‌న చేతికి మ‌ట్టి అంట‌కుండా జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారని అంటున్నారు ప‌రిశీల‌కులు.

-Vuyyuru Subhash 

Read more RELATED
Recommended to you

Latest news