దేశీయ “సెల్ఫ్ స్కాన్” యాప్ ను ప్రారంభించిన మమత …!

-

భారతదేశ ప్రభుత్వం ప్రజల రక్షణ నేపథ్యంలో చైనాకు సంబంధించిన 59 యాప్స్ ను నిషేదించించిన సంగతి తెలిసిందే. అయితే అందరికి ఎంతో ఉపయోగ పడే క్యాం స్కానర్ కూడా ఒకటి. అయితే ఇందుకు తగినట్టుగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం సరికొత్త డాక్యుమెంట్ యాప్ ను అభివృద్ధి చేసింది. ఆ యాప్ పేరే ” సెల్ఫ్ స్కాన్ “. తాజాగా ఈ యాప్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ లాంచ్ చేశారు. ఆ కార్యక్రమంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ… ఈ యాప్ దేశభక్తికి నిదర్శనమని తెలియజేశారు.

Mamata
Mamata

చైనా ఆప్ బ్యాన్ నేపథ్యంలో కొత్తగా ఇలాంటి యాప్స్ ను ఆవిష్కరించడం ప్రాధాన్యత సంతరించుకుంటోంది. అంతేకాకుండా మమత బెనర్జీ మాట్లాడుతూ నేను ఎప్పుడూ దేశీయంగా అభివృద్ధి చెందిన యాప్స్ ను మాత్రమే ఉపయోగిస్తామని, అది దేశభక్తిని కూడా ఇమడింప చేస్తుందని చెప్పుకొచ్చారు. నేడు బెంగాల్ ప్రభుత్వం ఏమి ఆలోచిస్తుందో, రేపు ప్రపంచం మొత్తం దాని గురించి ఆలోచిస్తుంది అంటూ మమతా బెనర్జీ తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news