అమెరికాలో పెద్ద ఎత్తున కార్చిచ్చు …!

-

2020 సంవత్సరం మొదలైనప్పటి నుండి ప్రపంచంలో ఏదో ఒక మూలన మరచిపోలేని సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. 2020 సంవత్సరం మొదట్లో ఆస్ట్రేలియాలోని అడవులు కార్చిచ్చు తో కొన్ని వేల ఎకరాలు నాశనమయ్యాయి. ఇక ఆ తర్వాత 2019 డిసెంబర్ లో మొదలైన కరోనా వైరస్ 2020 మొదటి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందిని బలి తీసుకుంటుంది. ఇకపోతే తాజాగా అమెరికా లోని కాలిఫోర్నియా అడవుల్లో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. అగువా డుల్సే సమీపంలోని కార్చిచ్చు తో వెంటనే అప్రమత్తమైన ఆ దేశ అధికారులు లాస్ ఏంజిల్స్ – మోజవే ఎడారిని కలిపే రహదారిని తాత్కాలికంగా మూసివేశారు.

fire america
fire america

దీంతో పాటు ఆ అడవి సమీపంలో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. మంటలను ఆర్పేందుకు హెలికాప్టర్ల సాయంతో అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపు ఇప్పటికే ఆడవి సంబంధించిన నాలుగు వందల ఎకరాల్లో కార్చిచ్చు తో కాలిపోయింది. రహదారిని మూసివేయడంతో ఎలాంటి ప్రాణ నష్టం కూడా జరగలేదు.

Read more RELATED
Recommended to you

Latest news