బ్రేకింగ్ : సినీ నటుడు రావి కొండల్ రావు కన్నుమూత..?

-

2020 సంవత్సరం లో భారతీయ చలన చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఎంతో మంది నటులు చిత్ర పరిశ్రమకు దూరం అవుతున్నారు. తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు.. రచయిత అయినా రావికొండలరావు కన్నుమూశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా రచయితగా దర్శక నిర్మాతగా కూడా రావికొండలరావు మంచి గుర్తింపు పొందారు. దాదాపుగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఆరువందలకు పైగా చిత్రాల్లో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు రావి కొండలరావు,

గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నటుడు రావి కొండలరావు బేగంపేట లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. తుది శ్వాస విడిచారు. ఇక రావికొండలరావు మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తూ సంతాపం తెలియజేశారు. కాగా రావికొండలరావు దసరా బుల్లోడు.. అందాల రాముడు.. రాధాగోపాలం భైరవద్వీపం..ఇలా ఎన్నో సినిమాల్లో విభిన్నమైన పాత్రల్లో నటించి తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news