ఆంధ్రప్రదేశ్‌లో నాలుగోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన చంద్రబాబు పాలనలో ప్రభుత్వ యంత్రాగంలో భారీగా మార్పులు చేర్పులు చేపడుతున్నారు.కీలకమైన పదవులు, నామినేటేడ్ పోస్టుల భర్తీపై దృష్టి సారించారు. ఇందులో భాగంగానే బాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ అడ్వకేట్ జనరల్‌గా సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ను నియమించారు.
ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్ర ప్రదేశ్ ఏజీగా పని చేసిన శ్రీరామ్ ఎన్నికల ఫలితాల తర్వాత తన పదవికి రిజైన్ చేశారు. దీంతో ఈ పదవిలో చంద్రబాబు దమ్మాలపాటి శ్రీనివాస్‌ను నియమించారు. 2014లో చంద్రబాబు దమ్మలపాటి శ్రీనివాస్‌కే రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌గా అవకాశం కల్పించారు. 2019లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలు కావడంతో దమ్మాలపాటి శ్రీనివాస్ పదవి నుండి తప్పుకున్నారు. తిరిగి ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేసిన చంద్రబాబు మరోసారి సీనియర్ న్యాయవాది శ్రీనివాస్‌కే అవకాశం కల్పించారు
.