క‌రోనాను సృష్టించింది చైనానే.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన హీరో నిఖిల్‌..!!

-

క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌ను ప్ర‌స్తుతం ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తుంది. ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డి మృత్యు ఒడిలోకి చేరుతున్న‌వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. మ‌రియు పాజిటివ్ కేసుల సంఖ్య 20 ల‌క్ష‌లు దాటిందంటే.. ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఈ క‌రోనా ర‌క్క‌సికి వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో ప్ర‌భుత్వాలు నివార‌ణ‌పైనే దృష్టి సారించారు. క‌రోనాను ఎలాగైనా మ‌ట్టుపఎట్టాల‌ని అనేక ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ క‌రోనా జోరు త‌గ్గ‌డం లేదు.

అయితే ఇదే స‌మ‌యంలో కొత్త వైరస్ పై కుట్ర కోణం ఉందా అన్న అనుమానాలు ప్రపంచదేశాల్లోనూ పెరుగుతోంది. ముఖ్యంగా చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైర‌స్‌ను చైనానే సృష్టించి.. ప్ర‌పంచ‌దేశాల‌పై వ‌దిలిందా అన్న అనుమానాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే కరోనా వైరస్ వ్యాపించడం వెనుక చైనా కుట్ర ఉందనే వార్తలు అన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా విభాగాల్లోనూ జోరుగా వినిపిస్తున్నాయి. అయితే ఇలాంటి టైమ్ హీరో నిఖిల్ క‌రోనాను సృష్టించిందే చైనానే అంటూ ఓ ఆస‌క్తిక‌ర పోస్ట్ పెట్టారు.

అందులో “చైనాలోని వుహాన్‌లో ఈ వైరస్ మొద‌ట సాని బ‌య‌ట‌ప‌డ‌గా.. చైనా జనవరిలో వుహాన్ నుండి చైనాలోని ఇత‌క ప్రాంతాల‌కు డొమెస్టిక్ ఫ్లైట్స్‌తో పాటు ఇతర రవాణా నిలిపివేసింది. కాని వుహాన్ నుండి అంతర్జాతీయ విమానాలను ఆపలేదు. చైనా ఎందుకు వూహాన్ నుండి అంతర్జాతీయంగా ప్రయాణించటానికి అనుమతించింది..? అంటే కావాల‌నే ఈ ప్రాణాంతక వైరస్‌ని ప్ర‌పంచ‌దేశాల‌పై వ‌దిలిందా అన్న అనుమానాలు వ్య‌క్తం చేశాడు నిఖిల్. ప్ర‌స్తుతం ఈ పోస్ట్ వైర‌ల్‌గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news