బస్సు, లారీ ఢీ.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు

-

ఇటీవల కాలంలో ప్రైవేట్ బస్సుల తీరు దారుణంగా మారింది. అతివేగం కారణంగా ప్రయాణికులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్న పరిస్థితి నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేట్ వాహనాలు ఢీ కొట్టడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. నరసాపురం నుంచి బెంగళూరుకు వెళ్తున్న బస్సును లారీ ఢీకొట్టింది. ఈ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులను తీవ్రగాయాలు అయ్యాయి. తిరుపతి జిల్లా పూతలపట్టు నుంచి నాయుడు పేట జాతీయ రహదారిపై పేలూరు బండ వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

రోడ్డు ప్రమాదం
రోడ్డు ప్రమాదం

30 మంది ప్రయాణిస్తున్న ఈ బస్సులో డ్రైవర్‌తోపాటు క్లీనర్, ప్రయాణికులు గాయపడ్డారు. బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. డ్రైవర్ కాలు క్యాబిన్‌లో ఇరుక్కుపోవడంతో పోలీసులు స్థానికుల సాయంతో బయటకు తీశారు. ఈ మేరకు సహాయక చర్యలు చేపట్టి.. క్షతగాత్రులను 108లో తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news