ఆంధ్రప్రదేశ్ రాజధాని గ్రామాల్లో భారీగా పోలీసు బలగాలు మొహరించాయి. 250 రోజుకు చేరుకుంది రాజధాని ఉద్యమం. రాజధాని అమరావతి జెఎసి నిరసనలకు పిలుపు ఇవ్వడం తో రాజధాని గ్రామాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు. రాజధాని గ్రామాలకు వెళ్లే రహదారుల్లో భారీగా భద్రత బలగాలు మొహరించాయి. వచ్చి పోయే వారిపై నిఘా పెట్టారు పోలీసులు. బయటవారు రాకుండా జల్లెడ పడుతున్న పోలీస్ లు తనిఖీలు కూడా చేస్తున్నారు.
విజయవాడ గుంటూరు వైపు నుండి వచ్చే వారి గుర్తింపు కార్డ్ లు చెక్ చేసి స్థానికులు అని నిర్దారించుకున్న తరువాతే పంపుతున్నారు పోలీస్ లు. మంతెన ఆశ్రమం వద్ద వచ్చే పోయే వాహనాలను తనిఖీ చేస్తున్నారు పోలీస్ లు. నేడు పలు నిరసన కార్యక్రమాలకు రాజధాని ప్రాంత రైతులు పిలుపునిచ్చారు. ప్రజలు అందరూ కూడా స్వచ్చందంగా పాల్గొనాలి అని కోరుతున్నారు.